కొలంబో పేలుళ్ల ఎఫెక్ట్ : విమానయాన సేవలు నిలిపివేత

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో.. దేశంలోని అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు తీవ్ర ముప్పు హెచ్చరికలను జారీ అయ్యారు. ఈ మేరకు శ్రీలంక పౌర విమానయానశాఖ డైరెక్టర్ జనరల్ హెచ్.ఎం.సి. నిమల్‌సిరి ప్రకటన చేశారు. బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు భద్రతా చర్యలను చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఉదయం కొలంబోని మూడు చర్చీలు, మూడు హోటల్లో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్దారు. ఈ ఘటనలో 160మందికి పైగా మృతి చెందారు. మరో 400మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.