శ్రీలంకలో మళ్లీ బాంబు పేలుళ్లు

శ్రీలంక రాజధాని కొలంబోలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. ఆదివారం వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వందల మంది చనిపోయారు. సోమవారం కూడా కొలంబోలో బాంబు పేలుళ్లు జరగడంతో అక్కడ మరింత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదివారం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొన్న సెయింట్ ఆంథోనీస్ చర్చి సమీపంలోనే సోమవారం మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది. మరోవైపు, కొలంబో ప్రధాన బస్‌స్టేషన్ వద్ద 87 బాంబులను గుర్తించారు. ఈ బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. ఆదివారం నాడు పేల్చేందుకు అమర్చిన బాంబులు సోమవారం నాడు పేలాయా.. ? లేదంటే ఉగ్రవాదులు మళ్లీ వచ్చి.. పేల్చారా ?? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.