శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా


యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. అతడి మ్యాచ్ ఫీజులో వందకు వంద శాతం కోత విధించింది.

ఢిల్లీతో మొదలైన రంజీ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ తరఫున బ్యాటింగ్‌‌కు దిగిన గిల్‌‌ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుబోధ్‌‌ భాటి బౌలింగ్‌‌లో ఔటయ్యాడు. అంపైర్ అవుటిచ్చినప్పటికీ క్రీజుల వదలని గిల్.. ఆ తర్వాత అంపైర్ మహ్మద్ రఫీ వద్దకు వెళ్లి తాను అవుట్ కాదంటూ వాదించాడు.

దీంతో లెగ్ అంపైర్‌ను సంప్రదించిన రఫీ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గిల్ ప్రవర్తన కారణంగా మ్యాచ్ పది నిమిషాలపాటు నిలిచిపోయింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక గిల్ 23 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. అయితే, గిల్ ప్రర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో వందకు వంద శాతం కోత విధించింది.