పంచాయతీ పోరు.. ఓటుకు పెద్దనోటు !

పంచాయతీ ఎన్నికల్లో ఈ నెల 21న జరగనున్న తొలివిడత పోలింగ్‌ జరిగే 3,701 పంచాయతీలు, వార్డుల్లో అభ్యర్థుల ప్రచార గడువు శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది. పెద్దఎత్తున గ్రామస్థులకు మాంసం భోజనాలతో పాటు తాగినంత మందు ఇస్తున్నారు. ఎన్నికల రోజు వరకు ఇలా గంపగుత్తగా విందులు ఇస్తున్నారు.

ఇక చివరి రోజు మాత్రం ఇంటింటికీ పంచిపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారమ్. అటు ఇటుగా ఉన్న వారికి ఓటుకి రూ.1000 నుంచి 2000 ఇచ్చి కొనేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోట పంచాయతీలో ఓ సర్పంచి అభ్యర్థి ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్సులో మద్యం తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు. ఈ సంఘటన విస్మయానికి గురి చేస్తోంది.

రెండో విడతలో (25వ తేదీన) పోలింగ్‌ నిర్వహించనున్న పంచాయతీలకు 23న, మూడో విడతలో(30వ తేదీ) పోలింగ్‌ నిర్వహించనున్న పంచాయతీలకు 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.