టీమిండియా ఫై ఆసీస్ ఘనవిజయం..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా తడబడింది. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో ఐదో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

టాపార్డర్‌ దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్‌, లోయరార్డర్‌ సైతం చేతులెత్తేసింది. రహానే (30), పంత్‌ (30), విహారి (28), విజయ్‌ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా సింగిల్‌ నెంకే పరిమితమయ్యారు. 112/5 ఓవర్‌ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది.

స్టార్క్‌, లయన్‌లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్‌ యాదవ్‌(2), ఇషాంత్‌ శర్మ(0), బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్టు మ్యాచ్‌ ఈనెల 26 నుంచి మొల్‌బోర్న్ వేదికగా జరగనుంది.