విరాట్ కి తొలి పరాభవం

వన్డేల్లో టీమ్‌ ఇండియా సిరీస్‌ విజయపరంపరకు తెరపడింది. చివరిదైన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్‌ 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. కాగా మహేంద్ర సింగ్‌ ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత విరాట్‌ కోహ్లీ తొలి వన్డే సిరీస్‌ ఓటమిని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నఅనంతరం భారత్‌ వన్డే సిరీస్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి.

అలాగే భారత్‌ 2016 తర్వాత వన్డే సిరీస్‌ కోల్పోవడం ఇదే మొదటిసారి. సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వన్డేల్లో టీమిండియా సిరీస్‌ విజయపరంపరకు తెరపడింది.

257 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 44.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. రూట్‌-మోర్గాన్‌ జంట మూడో వికెట్‌కు 186 పరుగులు జోడించింది. రూట్‌ రెండో వన్డేలోనూ శతకం చేసిన సంగతి తెలిసిందే. వన్డేల్లో తొమ్మిది సిరీస్‌ విజయాల తర్వాత టీమ్‌ఇండియా సిరీస్‌ కోల్పోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆగస్టు 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది.