క్రికెట్ కు కైఫ్ వీడ్కోలు

ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ రిటర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్ లో 13 టెస్టులు, 125 వన్డేలకు కైఫ్ ప్రాతినిధ్యం వహించాడు. కైఫ్ టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా… అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కైఫ్ ని ఇండియన్ జాంటీ రోడ్స్ గా పిలుచుకొంటుంటారు. ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. లోయర్ ఆర్డర్ లో జట్టును అనేకసార్లు ఆదుకున్నాడు. డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఫేవరేట్ జోడీ కైఫ్ నే. వీరిద్దరు ఒకే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అంతకుముందు భారత్ కు అండర్ 19 ప్రపంచ కప్ ని తెచ్చిపెట్టారు.

తన రిటైర్మెంట్ పై కైఫ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘తాను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు, ఏదో ఒక రోజు ఇండియాకు ఆడాలని కలలు కనేవాడినని చెప్పాడు. తన కలలను సాకారం చేసుకుంటూ భారత్ కు ఆడానని… తన జీవితంలో 190 రోజులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించానని తెలిపాడు. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన రోజు అని భావిస్తున్నా’నని పేర్కొన్నాడు.