సచిన్ కొడుకు డేటింగ్ పిక్స్.. వైరల్ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లవ్ ప్రపోజల్ చేసి వార్తల్లో నిలిచింది ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్. ఇటీవలే ‘కోహ్లీ ప్రేమించానని చెబుతూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని ట్వీట్ చేసింది. ఇప్పుడీ బ్యూటీతో సచిన్ తనయుడు అర్జున్ లంచ్ డేట్ లో కనిపించడం పెద్ద చర్చకే దారి తీసింది.

శ్రీలంకతో అండర్ -19 యూత్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అర్జున్ ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ముంబై ఆఫ్ సీజన్ క్యాంప్ నకు ఎంపిక చేయలేదు. దీంతో అర్జున్ ఇంగ్లాండ్ లోనే గడుపుతున్నారు. అక్కడ డేనియల్ వ్యాట్ కలిసి లంచ్ డేటుకెళ్లిన ఫోటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ డేటింగ్ సంబంధించిన మొదటి వార్త ఇది. భవిష్యత్ లో ఇలాంటి ఇంకెన్ని చూపిస్తాడో చూడాలి.