విండీస్ కోచ్ సస్పెండ్


హైదరాబాద్ వేదికగా ఇండియాతో జరిగిన రెండవ టెస్ట్ లో కరీబియన్ జట్టు తలపడిన విషయం తెలిసిందే. అయితే మూడవరోజు ఆటలో కీరన్ పావెల్ ఔటైన తర్వాత విండీస్ కోచ్ స్టువర్ట్ లా టీవీ అంపైర్ గదిలోకి వెళ్లి అనుచితవ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆ తర్వాత ఫోర్త్ అంపైర్ ఉండే ఏరియాలోకి వెళ్లి ఆటగాళ్ల సమక్షంలోనే ఫోర్త్ అంపైర్ అఫీషియల్స్ వద్ద మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతని చర్యలను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్‌బ్రాడ్ కోచ్‌పై వేటు వేశారు.

ICC కోడ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన తరువాత విండీస్ కోచ్ స్టువర్ట్ లా తన జట్టులో రాబోయే రెండు వన్డే ఇంటర్నేషనల్స్ కోసం సస్పెండ్ చేయబడ్డాడు, అందుకు అతను 100 శాతం జరిమానా మరియు మూడు డిజర్ట్ పాయింట్లు పొందాడు. 24నెలల కాలంలో లా ఖాతాలో నాలుగు డీమెరీట్ పాయింట్లు చేరడంతో అతడు రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవలసి వచ్చింది.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన ఆటగాళ్లపై జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం పడటాన్ని చూశాం. చాలా రోజుల తర్వాత ఓ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి.