Kubera OTT : ధనుష్‌ ‘కుబేరా’ సెన్సేషన్.. కానీ OTT రిలీజ్‌పై సందిగ్ధత

Kubera OTT : ధనుష్‌ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-పాలిటికల్ డ్రామా ‘కుబేరా’ జూన్ 20, 2025న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో తన మూడో వారంలో అడుగుపెట్టింది.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

అయితే ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రం OTTకు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా, ఒక కొత్త సమస్య తలెత్తింది. సినిమా కొన్ని అనధికారిక వెబ్‌సైట్లలో లీక్‌ అయిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రభావం అధికారిక డిజిటల్ విడుదలపై పడుతుందా లేదా అనేదే ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను జూలై 18, 2025 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు టాక్‌. అయితే ఇటీవల లీక్ అయిన నేపథ్యంలో ఈ తేదీ మారుతుందా? లేదంటే అమెజాన్ తన మొదటి ప్లాన్‌ ప్రకారమే ముందుకెళ్తుందా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read :  Ram Charan: మైండ్ బ్లాంక్ అయ్యేలా రామ్ చరణ్ లైనప్.. ఆ ముగ్గురు డైరెక్టర్లతో బొమ్మపడితే బాక్సాఫీస్ బద్దలే!

ప్రస్తుతం వరకు ఈ అంశంపై అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా సినిమాపై అభిమానుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. కుబేరా డిజిటల్ విడుదలపై మరిన్ని తాజా సమాచారం కోసం వేచి చూడాల్సిందే.