Yash : ‘కేజీఎఫ్’ మూవీతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న యశ్, ఇప్పుడు తన తల్లి కారణంగా హెడ్లైన్స్‌లో నిలిచారు. ఆయన తల్లి పుష్ప తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల నిర్మాతగా మారిన పుష్ప, ‘కొత్తలవాడి’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ చిత్రం ప్రమోషన్ బాధ్యతలన్నీ స్వయంగా చేపట్టిన ఆమె, ఒక ఇంటర్వ్యూలో ప్రసిద్ధ నటి దీపికా దాస్పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
“దీపికా దాస్ పెద్ద హీరోయిన్ కాదు. ఆమె పరిశ్రమలో ఏం సాధించింది?” అని పుష్ప చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో వైరల్ కావడంతో నెటిజన్ల ఆగ్రహం చెలరేగింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇంత అహంకారం ప్రదర్శించడం తగదని విమర్శలు వస్తున్నాయి. “ఒకే సినిమా తీసి ఫెయిల్ అయిన తర్వాత ఇంత ఒవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? యశ్ ఈ విషయంలో ఎక్కడ?” అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఫలితంగా నిర్మాతగా తొలి అడుగులోనే పుష్ప వివాదాల్లో చిక్కుకోవడం, ఆమె మాటల వల్ల పరోక్షంగా యశ్ కూడా టార్గెట్ కావడం కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.











