Gayapadda Simham Traiser : ట్రంప్ నిర్ణయం, తెలుగు యువకుడి పోరాటం…

Gayapadda simham traiser
తరుణ్ భాస్కర్ మరోసారి విభిన్నమైన కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత-దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ అనే కొత్త చిత్రానికి చేతులు కలిపారు. సప్తస్వర మీడియా వర్క్స్, పీవోవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంతినా, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమేనేని, ఉమేష్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పవన్ సదినేని ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్ పోస్టర్‌తో బజ్ క్రియేట్ చేసిన టీమ్ తాజాగా సరదాగా, ఆసక్తికరంగా ఉన్న ట్రైసర్‌ను విడుదల చేసింది.

Also Read :  Peddi OTT Partner: అఫీషియల్.. ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చిన్నప్పటి నుంచే అమెరికాకు వెళ్లాలనే కలతో పెరిగిన ఓ యువకుడి కథే ఈ సినిమా. అతని కల నిజమై యూఎస్ఏ చేరుకున్న వెంటనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్‌ను ప్రకటించడం అతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ సంక్షోభాన్ని అతడు ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా నిలబడ్డాడు అన్నదే కథాంశం. కాశ్యప్ శ్రీనివాస్ ఈ సమకాలీన అంశాన్ని వినోదాత్మకంగా, వ్యంగ్యాత్మకంగా చూపించారు. కేజీఎఫ్ స్టైల్ ప్రెజెంటేషన్‌కు పెళ్లి చూపులు తరహా హ్యూమర్‌ను జోడించడం ట్రైసర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగాల్ని సమర్థంగా పండించారు. ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్ నవ్వులు పూయిస్తే, మానసా చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ 2026లో విడుదల కానుంది.

Also Read :  Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊచకోత.. మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్ రికార్డ్!