ఉగాది సర్‌ప్రైజ్.. Chiranjeevi ‘ఉచిత విద్య’ ప్రాజెక్ట్ హింట్!

Chiranjeevi
మెగాస్టార్ Chiranjeevi మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటికే లక్షలాది మందికి సేవలు అందించిన ఆయన, ఇప్పుడు పేదరికంపై విద్యతో పోరాడేందుకు ముందుకొస్తున్నారు. ఉగాది సందర్భంగా ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’పై ఇచ్చిన హింట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తమిళ నటుడు Suriya స్థాపించిన ‘అగరం ఫౌండేషన్’ తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. “రక్తదానం ఎలా ప్రాణాలను కాపాడుతుందో, విద్య ఒక తరం భవిష్యత్తును మార్చగలదు” అంటూ పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే దిశగా అడుగులు వేస్తున్నానని వెల్లడించారు.

Also Read :  డేవిడ్ రెడ్డి కోసం న్యూ అవతార్‌లో మంచు మనోజ్

ఈ ఉచిత విద్యా కార్యక్రమాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా, అవసరం ఉన్న ప్రతి ప్రాంతానికి విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూపకల్పన, విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. ‘అగరం’ తరహాలో ప్రారంభించబోయే ఈ విద్యా కార్యక్రమం ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురానుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. సమాజ హితం కోసం చేపడుతున్న ఈ ప్రయత్నానికి ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.