Mega 158: సంక్రాంతి బరిలో మెగాస్టార్.. బాబీ సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ ఫిక్స్!

Mega

Mega 158: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ మరింత సంతోషంగా మారనుంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ Mega 158 చిత్రం రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవకాశాలు ఆల్మోస్ట్ ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇటీవలే పొల్లాచిలో కీలకమైన షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న చిత్ర యూనిట్, సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శరవేగంగా పని చేస్తోంది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంతో నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ చిరంజీవి గారికి ఎంతో కలిసివచ్చిన పండుగ కావడంతో, ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలోనే నిలపాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ద బ్లేడ్ దట్ సెట్ ద బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.

Also Read :  Fauzi: డిసెంబర్ బరిలో ‘ఫౌజీ’.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ!

ఈ చిత్రంలో అనస్వరా రాజన్, ప్రియమణి, నివేదా పేతురాజ్, రచితా రామ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. జైలర్ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే రానున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఏదేమైనా సంక్రాంతి రేసులోకి మెగాస్టార్ ఎంట్రీ ఇస్తుండటంతో థియేటర్లలో ‘పూనకాలు లోడింగ్’ ఖాయమని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.