Koratala Siva: కొరటాల శివ బర్త్‌డే స్పెషల్: ఆగస్టు నుంచే బాలయ్య ‘NBK 112’ షురూ.. ‘దేవర 2’పై క్రేజీ అప్‌డేట్!

Koratala Siva

Koratala Siva: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్‌తో ‘మిర్చి’, మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’, ‘దేవర: పార్ట్ 1’, మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ ఈ తన బర్త్ డేని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయనకు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు, లక్షలాది మంది అభిమానులు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

యువసుధ ఆర్ట్స్ కొరటాల శివను తమ ‘పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్’ (బలమైన పునాది) గా పేర్కొంటూ విషెస్ చెప్పింది. రాబోయే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘NBK 112’ (నందమూరి బాలకృష్ణ కాంబినేషన్) కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

Also Read :  NBK 112: బాలయ్య - కొరటాల శివ సినిమా షూటింగ్ అప్‌డేట్.. రెగ్యులర్ షూట్ ఆ నెల నుంచే!

సోషల్ మీడియాలో ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు కొరటాల ఇచ్చిన బ్లాక్ బస్టర్లను గుర్తు చేసుకుంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చేతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించబోతున్న ‘NBK 112’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు (2026) నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోందని టాక్ నడుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు సోషల్ మెసేజ్ జోడించి, ప్రేక్షకులను మెప్పించడంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కొరటాల శివ.. రాబోయే చిత్రాలతో మరిన్ని రికార్డులను సృష్టించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.