
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘స్పిరిట్’ తదుపరి కీలక షెడ్యూల్ ఈ ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో కొన్ని అత్యంత కీలకమైన జైలు సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్. సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త షెడ్యూల్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైలు నేపథ్యంలో వచ్చే ఈ సీన్లు సినిమాలోనే వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నో అంచనాలు ఉన్న ‘స్పిరిట్’ చిత్రాన్ని మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.














