
Prabhas Spirit: పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక ఊరమాస్ అప్‌డేట్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు ఒక బజ్ గట్టిగా వినిపిస్తోంది.
ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ప్రభాస్ ఏకంగా 100 మంది ఫైటర్లతో ఢీకొట్టబోతున్నారట. సందీప్ రెడ్డి వంగా తన మునుపటి చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ తరహాలోనే ఈ ఫైట్‌ను కూడా అత్యంత రా అండ్ ఇంటెన్స్ స్టైల్‌లో, రక్తపాతం ఉట్టిపడేలా సరికొత్త హై వోల్టేజ్ యాక్షన్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ భారీ ఇంటర్వెల్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి కాగానే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. ప్రస్తుతానికి ఇది అధికారిక సమాచారం కాకపోయినప్పటికీ, ఈ బజ్ గనుక నిజమైతే ‘స్పిరిట్’ ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవడం ఖాయం అని అంటున్నారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో, వంగ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతుందోనని ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి.













