Nani: ‘బ్లడీ రోమియో’పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Bloody Romeo

Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు దర్శకుడు సుజీత్‌తో కలిసి ‘బ్లడీ రోమియో’లో నటిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని ‘బ్లడీ రోమియో’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉండబోతుందని తెలిపారు. సినిమాలో యాక్షన్, వైలెన్స్ ఉన్నప్పటికీ.. ‘ది ప్యారడైజ్’ తరహాలో రా అండ్ రస్టిక్ ట్రీట్‌మెంట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు.

‘బ్లడీ రోమియో’ చాలా చమత్కారంగా సాగే స్టైలిష్ యాక్షన్ మూవీ అని నాని చెప్పారు. సుజీత్ ఈ కథను పూర్తిగా కొత్త ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఈ జానర్‌లో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని తరహాలో సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. థియేటర్లలో ఈ చిత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’కు పూర్తి భిన్నంగా, చాలా ఫ్రెష్‌గా ‘బ్లడీ రోమియో’ ఉండబోతుందని చెప్పారు. నాని చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. నాని ఇప్పటివరకు విభిన్న కథలు, జానర్లను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది ప్యారడైజ్’లో రగ్డ్, పీరియాడిక్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన ఆయన.. ఇప్పుడు సుజీత్‌తో కలిసి పూర్తిగా భిన్నమైన స్టైలిష్ యాక్షన్ జోన్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. మరి నాని–సుజీత్ కాంబినేషన్ టాలీవుడ్‌లో సరికొత్త స్టైలిష్ యాక్షన్ అనుభూతిని అందిస్తుందా? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.