
‘Yesanagula Katta Meeda’: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘ఏసనాగుల కట్ట మీద’ అంటూ సాగే ఈ పాటను సెకండ్ సింగిల్‌గా విడుదల చేయబోతున్నట్లు తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ పాటను ఆగస్టు 28న అనిరుధ్ రవిచందర్ డల్లాస్‌లో నిర్వహించనున్న లైవ్ షోలో స్టేజ్‌పై ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆగస్టు 29న ‘ఏసనాగుల కట్ట మీద’ పాటను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి, ప్రభ కలిసి పాటను పాడినట్లు డైరెక్టర్ ప్రకటించారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడంతో ఈ సాంగ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దీంతో రెండో పాట ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇక ‘ది ప్యారడైజ్’ కథ 1980ల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ‘జాదల్ జమానా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాటలతో హైప్ పెంచుతున్న మేకర్స్.. ‘ఏసనాగుల కట్ట మీద’తో మరింత జోష్ తీసుకురానున్నట్లు కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














