
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ కోసం చిరంజీవి మరోసారి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఇందుకోసం ఆయన మూడు నుంచి నాలుగు రోజుల డేట్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో సినిమా కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించే అవకాశముందని సమాచారం. లేదంటే గతంలో పూర్తయిన సన్నివేశాలకు సంబంధించిన పెండింగ్ ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో వచ్చే ఓ పాటకు సంబంధించిన సెటప్ ఇప్పటికే కొన్ని నెలల క్రితమే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో భారీ శివుడి విగ్రహం, అఘోరాల పాత్రలు కీలకంగా కనిపించనున్నాయని సమాచారం. కేరళకు ప్రత్యేకమైన ‘తెయ్యం’ సంప్రదాయ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శివుడి నేపథ్యం, అఘోరాల పాత్రలు, కేరళ తెయ్యం వాతావరణం కలిసేలా రూపొందనున్న ఈ సీక్వెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘విశ్వంభర’ను తెరకెక్కిస్తున్న చిత్రబృందం.. ఈ పాటను కూడా అదే స్థాయిలో రూపొందించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి పాల్గొనే మూడు, నాలుగు రోజుల షెడ్యూల్‌లో పాట చిత్రీకరణ జరుగుతుందా? లేక పెండింగ్ ప్యాచ్‌వర్క్ పూర్తవుతుందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా తదుపరి దశలోకి వెళ్లే అవకాశముంది. ఇక ‘విశ్వంభర’ను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అక్టోబర్ రిలీజ్‌కు సిద్ధం చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.













