
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కలిసి రూపొందిస్తున్న అంతర్జాతీయ స్థాయి మెగా బడ్జెట్ సై-ఫై యాక్షన్ చిత్రమైన AA22 షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. భారీ స్థాయి విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ అనేక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్టులో పనిచేస్తుండటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ టీమ్ విడుదలకు సాధ్యమైన తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, AA22 సినిమాను 2026లోనే విడుదల చేయాలని మేకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని సక్రమంగా జరిగితే డిసెంబర్ 2026ను ప్రధాన విడుదల ఆప్షన్‌గా భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా 2026 సమ్మర్ ప్రారంభం కూడా పరిశీలనలో ఉంది. షూటింగ్ 2026 సమ్మర్ నాటికి పూర్తవుతుందని అంచనా వేసినా, విస్తృతమైన CG మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకోనున్నాయి. ఆలస్యం కాకుండా ఉండేందుకు అట్లీ టీమ్ షూట్ చేస్తున్న తరుణంలోనే కంటెంట్‌ను CG విభాగానికి పంపిస్తూ సమాంతరంగా పని చేస్తుందట.









