Aasha : పూజతో మొదలైన ‘ఆశ’… కానీ ఈ సినిమాలో ఓ పెద్ద సర్ప్రైజ్ ఉంది!

Aasha movie

Aasha : మలయాళ సినీ రంగంలో సుపరిచితులు అయిన ఊర్వశి, జోజు జార్జ్ మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకునే చిత్రం ‘ఆశ’ భారీ అంచనాల మధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ మల్టీ లింగ్వల్ సినిమా ద్వారా సఫర్ సనల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

త్రిక్కక్కర వామనమూర్తి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరగగా, జోజు జార్జ్, మధు నీలకందన్, సఫర్ సనల్ లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి క్లాప్ జోజు జార్జ్ కొట్టగా, కెమెరా స్విచ్‌ఆన్ మధు నీలకందన్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లుక్ కూడా విడుదలై మంచి స్పందన పొందింది. అదేరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, ‘పాణి’ ఫేమ్ రమేష్ గిరిజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆశ’ మూవీ ఐదు ప్రధాన భారతీయ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రానికి మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ, షాన్ మహ్మద్ ఎడిటింగ్, మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సౌండ్ డిజైన్, సింక్ సౌండ్ కు అజయన్ అదత్, ప్రొడక్షన్ డిజైన్ కు వివేక్ కలాథిల్, స్టంట్స్ కు దినేష్ సుబ్బరాయన్ వంటి అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

Also Read :  Bhola Balayya: బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. 10వ తేదీ బర్త్‌డే సర్‌ప్రైజ్ కంటే ముందే.. జూన్ 7న గ్లోబల్ బ్లాస్టింగ్!

ఈ చిత్రానికి జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ కలిసి స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. ఫ్యామిలీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండనుంది. ‘ఆశ’ – కథ, అభివృద్ధి, భావోద్వేగాల కలయికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.