Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ‘చౌర్య పాఠం’ సంచలనం.. 200 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలతో భారీ విజయం.!

Chaurya paatam
Chaurya Paatam : చిన్న సినిమాగా విడుదలై, కంటెంట్ పవర్ ఏంటో నిరూపిస్తూ, ‘చౌర్య పాఠం’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను (200 Million+ Streaming Minutes) రాబట్టి, చిన్న సినిమాల కేటగిరీలో ఒక రికార్డు సృష్టించింది. చిత్ర హీరో ఇంద్రరామ్ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, తన తదుపరి సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాడు.

అయితే.. డైరెక్టర్ అవ్వాలని కలలు కనే ఓ కుర్రాడు తనే స్వంతంగా సినిమా చేయడానికి డబ్బులు అవసరమై ఓ గ్రామంలోని బ్యాంక్ దొంగతనం చేసే క్రమంలో ఆ ఊరిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఓ భారీ మోసాన్ని ఎలా కనిపెట్టాడు.. చివరకు బ్యాంకు దొంగతనం చేసాడా లేదా అనే కధనంతో ఈ సినిమాని తెరకెక్కించారు మేకర్స్.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నక్కిన నెరేటివ్‌ బ్యానర్‌పై డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు నిర్మాణంలో నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చౌర్య పాఠం’. రాజీవ్ కనకాల, సలీం ఫేకు, సుప్రియ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. చౌర్య పాఠం సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మే నెలలో ఓటీటీలోకి వచ్చింది.

‘చౌర్య పాఠం’ చిత్రానికి వస్తున్న అనూహ్య స్పందన, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ బలంగా ఉంటే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ఎంత పెద్ద విజయాన్ని సాధించగలవో మరోసారి రుజువు చేసింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమా, ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొంది, ‘ఎమర్జింగ్ హిట్’ గా నిలిచింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఇంద్రరామ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తన పాత్రలో ఒదిగిపోయి, భావోద్వేగాలను పలికించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక డెబ్యూ హీరోకు ఇంతటి ఆదరణ లభించడం అరుదైన విషయం.

తదుపరి చిత్రంపై అంచనాలు: ‘చౌర్య పాఠం’ విజయంతో నటుడు ఇంద్రరామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన రెండవ సినిమాను విభిన్న కథాంశంతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి చిత్రంతోనే నటుడిగా తన సత్తాను చాటుకున్న ఇంద్రరామ్, రెండో సినిమాతో ఎలాంటి ప్రయోగానికి సిద్ధమవుతున్నాడో చూడాలి. ఈ విజయం అతని కెరీర్‌కు గట్టి పునాది వేసిందని చెప్పడంలో సందేహం లేదు.