Idli Kottu : దసరా కి వస్తున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’..!

Idlikottu
Idli Kottu : ‘కుబేర’ బ్లాక్‌బస్టర్ తర్వాత నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మరో సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఇడ్లీ కొట్టు’ అనే టైటిల్ ఖరారైంది. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించగా, ఈ సినిమా తెలుగు–తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 1న విడుదల కానుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం హాట్ కాంపిటీషన్ నెలకొంది. చివరకు ధనుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ప్రైస్‌కు శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకుంది. నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని టాప్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. అయితే విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ రానుంది. అలానే అక్టోబర్ 1న రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ కూడా అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. మరి ఈ మూడు సినిమాలలో ఏది ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకుంటుందో చూడాలి.