
Chaitanya Reddy: ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు వరుస పరాజయాలతో పాటు తీవ్రమైన ఆర్థిక వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ‘లైగర్’ మిగిల్చిన చేదు అనుభవం నుంచి తేరుకోకముందే వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన సెటిల్మెంట్లు, బకాయిలు ఇంకా తెగకముందే.. పూరి జగన్నాథ్, ఛార్మిలపై ‘హనుమాన్’ నిర్మాత చైతన్య రెడ్డి చేసిన బహిరంగ ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సినిమా ఫ్లాప్ కాగానే పూరి జగన్నాథ్ తన ఫోన్ నంబర్ మార్చేశారని, ఛార్మి తమను అసలు పట్టించుకోవడమే మానేశారని ఆమె వాపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
చైతన్య రెడ్డి ఆరోపణల ప్రకారం.. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదలకు ముందు తాము భారీగా పెట్టుబడులు పెట్టి ప్రాజెక్ట్‌ను గట్టెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రిలీజ్‌కు ముందు పూరి కనెక్ట్స్ నుంచి అనేక హామీలు వచ్చాయి. తీరా సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసరికి.. వారి వైఖరి పూర్తిగా మారిపోయింది. డిస్ట్రిబ్యూషన్లో భారీగా నష్టపోయామని, ఇచ్చిన హామీల గురించి మాట్లాడదామంటే పూరి జగన్నాథ్ అందుబాటులో లేకుండా ఫోన్ నంబర్ మార్చేశారని, ఛార్మి కూడా తమ గోడును పట్టించుకోవడం లేదని చైతన్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో పూరి చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ, నేరుగా నంబర్లు మార్చేసి తప్పించుకుంటున్నారంటూ ఓ నిర్మాత బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి.
మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినా ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. నాన్-థియేట్రికల్ డీల్స్‌ను క్లోజ్ చేసి త్వరలోనే సినిమాను తీసుకురావాలని చూస్తున్న తరుణంలో ఈ పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అటు ‘లైగర్’ నష్టాల తాలూకు బకాయిల కోసం ఎగ్జిబిటర్లు సైతం ‘స్లమ్‌డాగ్’ రిలీజ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైతన్య రెడ్డి చేసిన ఆరోపణలు పూరి కాంపౌండ్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. కొత్త సినిమా ప్రమోషన్స్ మొదలయ్యేలోపు పూరి జగన్నాథ్, ఛార్మి ఈ వివాదాలను ఎలా పరిష్కరిస్తారు? బాధితులకు సమాధానం చెబుతారా లేక వివాదాలు మరింత ముదిరి ‘స్లమ్‌డాగ్’ విడుదలకు అడ్డంకిగా మారతాయా అన్నది టాలీవుడ్లో ఉత్కంఠ రేపుతోంది.













