
EVV Cinema: టాలీవుడ్‌లో సరికొత్త వైవిధ్యమైన స్టోరీలతో సినిమాలు తెరకెక్కుతున్న తరుణంలో.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈవీవీ సినిమా’, ‘ఎన్వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్ష్ రోషన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రియాంక ఆచార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మేజిక్ క్రియేట్ చేయనుందని మేకర్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, నేటి తరం ప్రేక్షకులను కనెక్ట్ చేసే బలమైన భావోద్వేగాలు, ట్విస్టులతో ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీవీ సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న 10వ సినిమా కావడం, అలాగే ఎన్వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.











