Kalki 2898AD: కల్కి 2898AD అరుదైన గౌరవం.. అక్కడ నామినేషన్ పొందిన ఏకైక తెలుగు సినిమాగా..

Kalki

Kalki 2898AD: ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌ కల్కి 2898ఏడీ మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2024 నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రంగా కల్కి 2898AD నిలిచింది.

ఈ అవార్డు రేసులో కల్కితో పాటు హోమ్‌బౌండ్, ఎల్‌2 ఎంపురాన్, మహారాజ్, స్త్రీ-2, సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీ వేరే జోనర్‌కు చెందినవైనా, కల్కి వంటి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ కలిగించే చిత్రం లేకపోవడం వల్ల, ఈ మూవీకి అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇక ఉత్తమ నటుడు విభాగంలో మోహన్ లాల్ (ఎల్‌2 ఎంపురాన్), అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా (హోమ్‌బౌండ్), జునైద్ ఖాన్ (మహారాజ్), ఆదర్శ్ గౌరవ్ (సూపర్‌బాయ్స్) నామినేట్ అయ్యారు. అయితే ఈ లిస్ట్‌లో తెలుగు నటులు ఎవ్వరూ లేరన్నది కొంచెం నిరాశ కలిగించే విషయం. అదే విధంగా ఉత్తమ నటి విభాగంలో కూడా తెలుగు నుంచి ఎవరూ నామినేట్ కాలేదు. ఈ సందర్భం తెలుగు చిత్రసీమకు ఓ రిమైండర్‌గా భావించాలి. నటన పరంగా కూడా ఉత్తమ ప్రతిభను కనబర్చే సినిమాలు మరిన్ని రావాలన్నదే ప్రేక్షకుల ఆకాంక్ష.