
Mega158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #Mega158. తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మరో కీలక షూటింగ్ షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇదే షెడ్యూల్లో ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ చిత్రీకరణ కూడా పూర్తైనట్లు సమాచారం.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ బాబీ తన స్టైల్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అప్డేట్ మెగా అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అప్డేట్ కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 1న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోతో సినిమా మేకింగ్ స్టాండర్డ్స్‌ను అభిమానులకు చూపించనున్నారని టాక్. అలాగే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ అప్డేట్ నిజమైతే మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ దక్కనున్నట్టే అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, రచితా రామ్, మురళీ శర్మ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














