Vrusshabha Teaser : మోహ‌న్‌లాల్ ‘వృష‌భ’ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

Vrushabha
Vrusshabha Teaser : యాక్టర్ మోహన్‌లాల్ మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించడానికి ‘వృష‌భ’ సినిమాతో రాబోతున్నారు. నందకిషోర్ దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో క‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘వృష‌భ’ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మోహ‌న్‌లాల్ గుడ్‌న్యూస్ వినిపించారు. ‘వృష‌భ’ టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. “యుద్ధాలు, భావోద్వేగాలు, గ‌ర్జ‌న” అంటూ మోహ‌న్‌లాల్ చేసిన ట్వీట్‌ వైర‌ల్ అవుతోంది. రోర్ ఆఫ్ వృష‌భ‌, ది వ‌ర‌ల్డ్ ఆఫ్ వృష‌భ అంటూ ఈ ట్వీట్‌లో మోహ‌న్‌లాల్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ తోనే టీజ‌ర్‌ను ఎప్పెడెప్పుడూ చూడాలా అనే ఇంట్రెస్ట్‌ను ఫ్యాన్స్‌లో క్రియేట్ చేశారు మోహ‌న్‌లాల్‌. పోస్టర్‌లో త్రిశూలాకార కత్తి పట్టుకొని, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న మోహన్‌లాల్, ‘వృష‌భ’ లో యోధుడిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read :  GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం

‘వృష‌భ’ సినిమా మైథాలజీ, యాక్షన్, డ్రామా, సస్పెన్స్ అన్ని అంశాలను కలిపి ప్రేక్షకులకు గ్రాండియర్ విజువల్స్‌తో కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. తండ్రీ కొడుకుల అనుబంధం హృద‌యాల‌కు హ‌త్తుకుంటుంది. ఇకపోతే శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా వంటి దిగ్గ‌జ నిర్మాత‌లు వృష‌భ సినిమాలో భాగ‌మ‌య్యారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ‘వృష‌భ’ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.