Dacoit : ‘డకాయిట్’ నుంచి మృణాల్ ఠాకూర్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్!

Dacoit
Dacoit : అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’ ఇటీవల విడుదల చేసిన పవర్ గ్లింప్స్ ద్వారా భారీ అంచనాలు ఏర్పడింది. ప్రేమ మరియు ప్రతీకారం నేపథ్యంలో నూతన దర్శకుడు షానియల్ డియో రూపొందిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మృణాల్ పాత్రకు సంబంధించిన ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె చేతిలో గన్ పట్టుకొని లక్ష్యాన్ని ఎయిమ్ చేస్తూ, కళ్ళల్లో ఆక్రోశం, బాధ, ఫైటింగ్ స్పిరిట్ అన్నీ ప్రతిఫలించేలా కనిపిస్తుంది. ముఖంపై గాయాలు, కన్నీళ్లు ఆమె పాత్రలో ఉన్న భావోద్వేగ పరిమాణాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఈ సినిమాలో మృణాల్ పోషిస్తున్న జూలియెట్ పాత్ర కేవలం లవ్ ఇంటరెస్ట్‌గానే కాకుండా, రివెంజ్ డ్రామాకి సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో లీడ్ యాక్టర్స్‌తో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా, డిసెంబర్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.