టాప్ గేర్‌లో ‘#TheParadise’.. ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్ క్లోజ్!

The Paradise

TheParadise: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘#TheParadise’. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఎలాగైనా సరే ఈ నెలాఖరు (జూన్) లోపు సినిమాకు సంబంధించిన పూర్తి టాకీ పార్ట్ షూటింగ్‌ను ముగించాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉందట. దర్శక నిర్మాతలు పక్కా ప్లానింగ్‌తో షెడ్యూల్స్ డిజైన్ చేయడంతో, టాకీ పార్ట్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని సమాచారం.

Also Read :  AK47 Movie: త్రివిక్రమ్ మార్క్ మాస్ మసాలా.. ‘AK47’లో నివేదా పేతురాజ్ స్పెషల్ సాంగ్!

ఈ నెలాఖరుకల్లా ఈ మేజర్ పార్ట్ పూర్తయితే, ఇక ఆ తర్వాత కేవలం పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉంటాయని తెలుస్తోంది. టాకీ పార్ట్ పూర్తయిన వెంటనే గ్రాఫిక్స్, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పనులను వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ అప్‌డేట్‌తో సినిమా అనుకున్న సమయానికే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని నానీ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమచారాం ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.