
Ghaati : చాలా గ్యాప్ తర్వాత క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు కృష్ణ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఒడిశా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ఈ సినిమాలో అనుష్క పోషించిన శీలావతి పాత్ర ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. శీలావతిగా ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈసారి దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో అనుష్కతో ఊచకోత చేయించినట్టుగా ఉంది. విద్యాసాగర్ సంగీతం, రామ్ కృష్ణ స్టంట్స్, మణోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా డైలాగులు సినిమాకు అదనపు బలం చేకూర్చాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపిస్తుండగా, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ విభాగం కూడా విశేషంగా తోడ్పడ్డాయి. మొత్తంగా రేపటి నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు ఘాటి సిద్ధమవుతుండగా, అనుష్క నటన అరుంధతిని మించిపోతుందనే టాక్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.












