
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే ఊపులో ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించే పనిలోపడ్డారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్‌లో పెడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ లైనప్ ఊహకందని రేంజ్‌లో ఉండబోతోందని టాక్.
మళ్లీ లెక్కల మాస్టారుతో..
రామ్ చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ లెక్కల మాస్టార్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రంగస్థలం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అంటున్నారు. టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ఇద్దరు ఊర మాస్ డైరెక్టర్లతో చరణ్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. దీని తర్వాత అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టి ఇప్పుడు సిర్పిట్ అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా చరణ్ సినిమా లైన్‌లో ఉందని చెబుతున్నారు. ఈ లైనప్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. సుకుమార్ క్లాస్ అండ్ మాస్ టేకింగ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు, సందీప్ వంగా ఇంటెన్సిటీ తోడైతే మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వేటను ఆపడం ఎవరి తరం కాదని మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.











