Ramani Kalyanam : దీప్శిక, సూర్య వశిష్ట ‘రమణి కళ్యాణం’ టైటిల్ గ్రాండ్ గా లాంచ్!

Ramanikalyanam
Ramani Kalyanam : దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రమణి కళ్యాణం’. ఈరోజు చిత్ర బృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి సినీ ప్రముఖులు పాల్గొని టైటిల్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జీవితం లోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, ఎమోషన్స్ తో కూడిన అందమైన ప్రయాణంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  Ram Charan Devalayam: గుడి కట్టే రేంజ్‌లో రామ్ చరణ్ క్రేజ్.. కూకట్‌పల్లిలో మెగా అభిమానుల అరాచకం.. ఏం జరిగిందంటే?

ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ తిరుకోవెల సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్, విజయ్ ఆదిరెడ్డి కలిసి స్క్రీన్‌ప్లే రాశారు. ‘కోర్ట్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ‘రమణి కళ్యాణం’ తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించుకుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ వంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయని చిత్ర బృందం తెలిపింది.