Mowgli Trailer : రోషన్ కనకాల కొత్త ప్రయోగం.. ‘మోగ్లీ’ ట్రైలర్‌తో భారీ హైప్

Mowgli
Mowgli Trailer : యువ నటుడు రోషన్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న రెండో చిత్రం ‘మోగ్లీ 2025’ తో పూర్తిగా కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా, తాజాగా ఈరోజు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

మోగ్లీ ప్రేయసి చెవిటి–మూగ నర్తకి, అడవిలో షూటింగ్ చేస్తున్న ఫిల్మ్ యూనిట్‌లో భాగం. షూటింగ్ సమయంలో దర్శకుడు ఆమెతో ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించడంతో అతడికి మోగ్లీ వార్నింగ్ ఇస్తాడు. ఇదిలా ఉండగా, అదే ప్రాంతానికి విలన్ సరోజ్ కుమార్ పోస్టింగ్ అవ్వడం, అతనికి ఆ అమ్మాయి మీద ఆసక్తి ఉండటం వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. ఆమెను రక్షించేందుకు మోగ్లీ ఎదురుకునే సవాళ్లు, విలన్‌తో వచ్చే ఘర్షణ కథలో ప్రధానంగా నిలుస్తాయి. రామాయణ శైలి కథనం, అడవి నేపథ్యం, ఎమోషన్‌తో కూడిన లవ్ ట్రాక్ ట్రైలర్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

రోషన్ కనకాల చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, బండి సరోజ్ కుమార్ శక్తివంతమైన విలన్ పాత్ర, కాల భైరవ సంగీతం, రామ మారుతి ఎం అందించిన నేచురల్ విజువల్స్ ట్రైలర్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చాయి. హర్ష చెముడు కామెడీతో హైలైట్ అయ్యాడు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రంపై ట్రైలర్ భారీ అంచనాలు పెంచింది.