Santosham Awards 2025 : ఆనందం, ఆహ్లాదం మేళవించిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్

02

Santosham Awards 2025 : అంగరంగ వైభవంగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో, సినీ ప్రేమికుల మధ్య ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, నటులు మురళీ మోహన్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్న సందర్భంగా అశ్వినీ దత్‌కు ప్రత్యేక సత్కారం జరిగింది. అనంతరం రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. మోహన్ బాబు, విష్ణు మంచు అవార్డులు అందుకున్నారు. అదే విధంగా మంచు మూడో తరం అవ్రామ్, తన తాత మోహన్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

03

కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు.. బాబు మోహన్‌కు మురళీమోహన్ చేతుల మీదుగా ప్రదానం. పాటల రచయితగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్కు ఘన సన్మానం. అనంత శ్రీరామ్, ఆరాధన రామ్ (కన్నడ), నిధిలం స్వామినాథన్ (తమిళం) వంటి వారు కూడా మురళీమోహన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న వారిలో నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, గాయని కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, దర్శకుడు యాదువంశీ, గాయని మధుప్రియా, హీరోలు చంద్రహాస్, శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, నిర్మాతలు సతీష్, మురళీ గింజుపల్లి తదితరులు ఉన్నారు. ఓటిటి విభాగంలో నైన్టీస్ (ETV Win) సిరీస్‌కు చెందిన హాసన్, రోహన్ రాయ్, నటి జోర్దార్ సుజాత అవార్డులు అందుకున్నారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ వేడుకకు ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్టనర్‌గా, సూర్య సిమ్ పవర్డ్ బై స్పాన్సర్‌గా వ్యవహరించింది. సంధ్య సిల్క్స్, కుబేర సిల్క్స్, విజయ్ వారాహి మూవీస్, వెన్లక్స్, డి ఎన్ సి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లోగో ఇన్ఫ్రా, వివికే హోసింగ్, మహారత్న గ్రూప్, ఫిట్డే, ఎస్‌వివిఏ & ఎస్ట్యూరీ వంటి సంస్థలు సహకరించాయి. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సురేష్ కొండెటి.