Telusu Kada Teaser : ఎమోషన్స్, రొమాన్స్‌తో ఆసక్తి రేపుతున్న ‘తెలుసు కదా’ టీజర్..

Telusukada
Telusu Kada Teaser : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.

Also Read :  Panja Vaisshnav: మూడేళ్ల గ్యాప్.. 100 కథల రిజెక్షన్! ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్‌లో పెట్టిన మెగా హీరో

టీజర్‌లో సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి మధ్య లవ్ ట్రయాంగిల్ కథను ఆసక్తికరంగా చూపించారు. “Love U2” ట్యాగ్‌లైన్‌తో టీజర్ యూత్‌ఫుల్ వైబ్స్, ఫన్, రొమాన్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఇద్దరు హీరోయిన్స్ తో కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంది. సిద్ధు కొత్త స్టైలిష్ లుక్‌తో కనిపించగా, రాశి ఖన్నా ట్రెడిషనల్-మోడ్రన్ గెటప్‌లతో మెప్పించింది. శ్రీనిధి శెట్టి పాత్ర కూడా కూడా కట్టిపడేసింది. వైవా హర్ష హాస్యం జోడించగా, జ్ఞానశేఖర్ VS అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఎస్ థమన్ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. మొత్తానికి, స్ట్రాంగ్ క్యాస్ట్, స్టైలిష్ విజువల్స్, న్యూ ఏజ్ లవ్ స్టోరీ టచ్‌తో ‘తెలుసు కదా’ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ప్రేక్షకులలో భారీ అంచనాలు రేపుతోంది.

Also Read :  AK47 Movie: త్రివిక్రమ్ మార్క్ మాస్ మసాలా.. ‘AK47’లో నివేదా పేతురాజ్ స్పెషల్ సాంగ్!