Sundeep Kishan: విజయ్ కొడుకు సెట్స్‌లో అలా ఉంటాడని ఊహించలేదు: హీరో సందీప్ కిషన్

Adhika masa purnima (1)

Sundeep Kishan: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#Sigma’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ఫోన్ పట్టిన మొదటి సినిమాతోనే జేసన్ సంజయ్ ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ కిషన్.. తన డైరెక్టర్ జేసన్ సంజయ్ వర్కింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేసన్ సంజయ్ పనితనం గురించి చెబుతూ “జేసన్ సంజయ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆయనకు సినిమాపై ఉన్న ఓర్పు, క్లారిటీ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. ఒక స్టార్ హీరో కొడుకు అనే గర్వం అస్సలు లేకుండా.. చాలా గ్రౌండెడ్‌గా, హంబుల్‌గా ఉంటారు. సెట్స్‌లో ఆయన ప్రవర్తన అందరికీ నచ్చుతుంది” అని కొనియాడారు. ఈ ‘#Sigma’ ప్రాజెక్ట్ కోసం జేసన్ సంజయ్ అండ్ టీమ్ చాలా కాలంగా పక్కా ప్రణాళికతో వర్క్ చేస్తోందని సందీప్ కిషన్ వెల్లడించారు. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా.. ప్రీ-ప్రొడక్షన్ పనుల దగ్గరి నుంచి ఎడిటింగ్ టేబుల్ వరకు ప్రతి విషయంలోనూ చాలా డీటెయిల్‌గా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జేసన్ వర్క్ చేస్తున్నాడని, సినిమా అవుట్‌పుట్ నెక్స్ట్ లెవెల్‌లో రాబోతుందని హింట్ ఇచ్చారు. సందీప్ కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. దళపతి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.