Mirai : వైబ్ ఉంది బేబీ!!.. తేజ సజ్జా ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ అదుర్స్!

Mirai
Mirai : హనుమాన్ విజయంతో నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’ సినిమాలో సూపర్ యోధ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టీజర్, గ్లింప్స్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన మొదటి సింగిల్ “వైబ్ ఉంది” పూర్తి లిరికల్ వీడియో ప్రేక్షకులను ఉత్సాహభరితంగా మార్చింది.

Also Read :  Killer Movie Accident: 'కిల్లర్' షూటింగ్‌లో ఘోరం.. బిన్నీ మిల్స్ పేలుడులో ఒకరు మృతి!

ఈ పాటలో అర్మాన్ మాలిక్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో మెస్మరైజ్ చేయగా, కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ తెలుగు-ఇంగ్లీష్ మిశ్రమంతో న్యాచురల్ ఫీల్ తీసుకొచ్చాయి. తేజ సజ్జా డ్యాన్స్ మూమెంట్స్, స్టైల్, ఎనర్జీ అన్నీ కలిసి ఈ పాటను విజువల్ ఫెస్టుగా మార్చాయి. రుతికా నాయక్ గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంది. ‘మిరాయ్’ సినిమాలో మనోజ్ మంచు విలన్‌గా, శ్రియా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడిగా ఉన్న కార్తీక్ ఘట్టమనేని, సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్‌ప్లేను కూడా స్వయంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ విజువల్ వండర్ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్లలో, 8 భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Also Read :  Khushbu Sundar: సీఎం విజయ్‌ను కలిసిన కుష్బూ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?