Murali Naik Biopic : వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్ పాన్ ఇండియా స్థాయిలో

Murali naik biopic

Murali Naik Biopic : వీర జవాన్ మురళి నాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు హీరో గౌతమ్ కృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో మురళి నాయక్ పాత్ర పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత కే సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – “జై భారత్.. జై మురళి నాయక్. ఇది కేవలం సినిమా కాదు, ఒక రియల్ హీరో కథ. ఇప్పటివరకు ఒక్క తెలుగు సైనికుడిపై కూడా బయోపిక్ రాలేదు. మురళి నాయక్ కథ అటువంటి అరుదైనది. ఆపరేషన్ సింధూరంలో వీరమరణం పొందిన ఆయన జీవితం దేశానికి గర్వకారణం. మురళి గారి తల్లిదండ్రులు కూడా మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారి ఆశయం – ‘మా అబ్బాయి జీవితం ఉన్నది ఉన్నట్లుగా చూపించండి, దేశానికి పరిచయం చేయండి’ అనే మాట. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా మా ప్రయత్నం ఉంటుంది” అన్నారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

తన గత చిత్రం సోలో బాయ్ రిలీజ్ సందర్భంగా మురళి నాయక్ కుటుంబాన్ని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ – “మురళి గారి కథ విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు ఆగలేదు. అలాంటి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌లో నటించడం నాకు గౌరవం. ఇది సాధారణ సినిమా కాదు, దేశం గర్వపడే ఎమోషన్” అని గౌతమ్ తెలిపారు. నిర్మాత కే సురేష్ బాబు మాట్లాడుతూ – “ఇది సినిమా కంటే ఎక్కువ.. ఒక ఇండియన్ ఎమోషన్. మురళి నాయక్ జీవితం అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ కథను ప్రతి భారతీయుడు గర్వపడేలా మేము చూపించబోతున్నాం” అన్నారు. మురళి నాయక్ తండ్రి మాట్లాడుతూ – “భారత్ మాతాకీ జై. నా కొడుకు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందాడు. గౌతమ్ బాబు ఈ సినిమా ద్వారా మురళి కథను ప్రజలకు అందించాలి. ఈ సినిమా ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోవాలి” అన్నారు. మురళి నాయక్ తల్లి మాట్లాడుతూ – “మురళి చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్నాడు. దేశానికి సేవ చేయాలని వెళ్లాడు. చచ్చినా బ్రతికినా అక్కడే ఉండాలనుకున్నాడు. ఈ సినిమాలో మురళి పాత్రను గౌతమ్ పోషించడం మా కుటుంబానికి ఆనందం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అని తెలిపారు.