
Mirai ; ఇటీవల టాలీవుడ్‌లో ఒక కొత్త ఫ్యాషన్ చూస్తున్నాం. కొన్ని సినిమాల్లో రిలీజ్‌కు ముందే వచ్చిన సాంగ్స్ ఆడియో హిట్‌గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయి, కానీ సినిమాలో ఆ పాటలు కనిపించవు. ‘దేవర’, ‘గేమ్ ఛేంజర్’, ‘కింగ్డమ్’ వంటి సినిమాల్లో ఇదే జరిగింది. తాజాగా రిలీజ్ అయిన ‘మిరాయ్’ సినిమా కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యింది. తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన ‘వైబ్ ఉంది బేబీ’ సాంగ్ సోషల్ మీడియాలో హిట్ అయ్యింది. కానీ థియేటర్‌లో మాత్రం ఆ పాట కనిపించలేదు.
దీనికి కారణం, హీరోయిన్ రితిక నాయక్ పాత్ర సాధ్వి కాబట్టి, ఈ సాంగ్‌ను సినిమా లో పెట్టడం సరైనది కాదని ఫిల్మ్ టీమ్ భావించినట్లు తెలుస్తుంది. ఇక చివరి ఎండ్ సీక్వెన్స్ డివోషనల్ టచ్ తో ముగిసినందున, ఎండ్ టైటిల్స్‌లో కూడా ఈ పాటను చేర్చలేదు. ఏదేమైనా, సోషల్ మీడియాలో ఈ పాట పట్ల వచ్చిన సానుకూల స్పందన సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచడంలో సహాయపడింది. ఇకపోతే కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ చిత్రం డివోషన్, యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది.












