ఆంధ్రా – తెలంగాణ మ‌ధ్య ఎన్నిక‌లా..?

రాజకీయాలు..తమ స్వార్ధ ప్రయోజనాలకోసం పెట్టుకున్న పేరు..ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి తమ సొంత లాభాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలు అయ్యింది. తమ నాయకుడు ఏం చేసిన..ఏం చెప్పిన అదే కరెక్ట్..అదే వేదంలా ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికలు రాజకీయ నాయకుల మధ్య కాదు ఆంధ్ర – తెలంగాణ మధ్య అన్నట్లు సాగుతున్నాయి.

తమ లాభాల కోసం ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల పేర్లు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ విడిపోయాక అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. రెండు రాష్ట్రాలు నాల్గు ఏళ్లుగా ప్రశాంతంగానే ఉన్నాయి. ఆంధ్రప్రజలు తెలంగాణాలో..తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటివరకు వారిమధ్య ఎలాంటి బేధాలు మొదలు అవ్వలేదు. కానీ తాజాగా ఎన్నికల సమయంలో వారిమధ్య బేధాలు సృష్టిస్తున్నారు రాజకీయనాయకులూ. తమ లాభాల కోసం ఆంధ్ర – తెలంగాణ అంటూ విభజించి వారి మధ్య చిచ్చు పెడుతున్నారు. దీని గురించే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.. మరి వారు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే వినండి.