జనసేన బలం..బలహీనతలు

మరో నెల రోజుల్లో ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి..ఎవరికీ వారే తమ గెలుపుపై ధీమా గా ఉన్నారు. ఏ సభ పెట్టిన..ఏ రోడ్ షో చేసిన జనాలు తండోప తండాలుగా వస్తున్నారు. ఆ జనాలను చూసి తమ గెలుపు ఖాయం అంటున్నారు. కానీ పోలింగ్ బూతు కు వచ్చిన జనాలు ఏవైపు మొగ్గుతారో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతం పార్టీల బల బలహీనతలు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన విషయానికి వస్తే..గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు..ఎన్నికల సమయంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసారు. చిరంజీవి వెంట పవన్ కూడా తిరిగారు. కానీ ఆ ఆతర్వాత ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోవడం..ఆ తర్వాత ఆ పార్టీ ని చిరంజీవి కాంగ్రెస్ లో కలపడం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఆ పార్టీ కి జనసేన ఆపార్టీకి ఏమాత్రం సంబంధం లేదు.

పవన్ ఎంచుకున్న బాట వీరు..చిత్ర సీమలో కోట్లు సంపాదించుకునే సత్తా ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి ప్రజలకు సేవ చేయాలనీ పవన్ జనసేన పార్టీ ని స్థాపించారు. మొదటి నుండి కూడా ప్రజలకు మంచి జరగాలని చూసారు. గత ఎన్నికల్లోనూ టిడిపి కి మద్దతు ఇవ్వడానికి కారణం కూడా అదే. కానీ టిడిపి ప్రజలకు మేలు చేయడంలో విఫలం కావడం తో ఈసారి ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు. అదే విధంగా తన ఆశయాలని , అభ్యర్థులను , సంక్షేమ పథకాలను , అధికారంలోకి వస్తే ఏం చేయగలడో చెపుతూ ప్రజల్లోకి వెళ్తున్నాడు.

పవన్ కు ప్రజల్లో భారీ ఇమేజ్ ఉంది..కేవలం సినిమాల పరంగా అభిమానించే వారు కాదు వేరే వారు సైతం పవన్ వ్యక్తిత్వం , ఆశయాలను చూసి ఇష్టపడతారు.. జనసేన కు ప్రదానం బలం పవన్…మైనస్ కూడా పవనే. ఎందుకంటే జనసేన పార్టీ లో పవన్ తప్ప వేరే వ్యక్తులెవరు ఎవరికీ తెలియదు. వారు ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. దీంతో వారికీ ఓటు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రజల్లో కలుగుతుంది. అదే విధంగా పార్టీ ను గ్రౌండ్ లెవల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనూ పవన్ ఫెయిల్ అయ్యాడు. పార్టీ మొత్తం ఒక్కడే చూసుకోవాల్సి రావడం తో అన్ని ఒక్కడే చూసుకోలేపోతున్నాడు.

ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు జనసేన బల బలహీనతల గురించి మాట్లాడుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారో మిరే ఈ కింది వీడియో లో చూడండి.