నాగ‌బాబు చేరిక‌తో ప‌వ‌న్‌కి బ‌లం

మొత్తానికి నాగబాబు తమ్ముడి దగ్గరకు వచ్చాడు. గత కొన్ని రోజులు వెనుకాల ఉంటూ జనసేన పార్టీ కి సపోర్ట్ ఇస్తూ వస్తున్న మెగా బ్రదర్..ఈరోజు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. నాగబాబు చేరికతో జనసేన కు మరింతం బలం వచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం వ‌రకు ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌టం పై ఆస‌క్తి చూప‌లేదు. అయితే ప‌వ‌న్ కోరిక మేర‌కు నాగబాబు జ‌న‌సేన లో చేరినట్లు తెలుస్తుంది. గ‌త వారం నాగబాబు గుంటూరు లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఇప్ప‌టికే చంద్ర‌బాబు..జ‌గ‌న్ పై పొలిటిక‌ల్ సెటైర్లు తో ప‌రోక్షంగా జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన త‌రువాత ఇప్పుడు నాగబాబు చేర‌టం తో కొంత ఆల‌స్యం క‌నిపిస్తున్నా..ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మెగా సోద‌రులు పోటీ చేస్తుండ‌టంతో అక్క‌డ ఖ‌చ్చితంగా జ‌న‌సేన ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

నాగబాబు చేరిక ఫై రాజకీయ విశ్లేషకులు ఇంకేమంటున్నారో వారి మాటల్లోనే వినండి.