గేదెల‌ను స‌స్పెండ్ చేసి ప‌డేసిన ప‌వ‌న్..

జనసేన సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. తాజాగా జనసేన పార్టీ గేదెల శ్రీనివాస్ (శ్రీనుబాబు) ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం. పవన్ కళ్యాణ్ ఈ నెల 14న రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో శ్రీనివాస్‌ను విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. శ్రీనివాస్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జనసేనలో కీలక నేతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీ మారడం ఆసక్తికరంగా మారింది.

దీని వెనుక పెద్ద కారణమే ఉందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. గేదెల శ్రీనివాస్ ఫై అవినీతి ఆరోపణలు బయటపడం..తన దగ్గర పనిచేసే వారికే సరిగా జీతాలు ఇవ్వలేని వాడు అంటూ సోషల్ మీడియా లో ఆరోణలు బయటపడ్డాయట. ఈ విషయం పవన్ వరకు వెళ్లడం తో ఆయన ఓసారి క్రాస్ చెక్ చేసి అవి నిజాలే అని తేలడం తో ఆయన్ను ఆఫీస్ పిలిచి ఆయన టికెట్ రద్దు చేయడమే కాదు ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసాడట. ఆ తర్వాత వెంటనే వైస్సార్సీపీ లో చేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో గేదెల శ్రీనివాస్ ఫై పెద్ద చర్చ జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఇంకా వారు ఏమంటున్నారో వారి మాటల్లో వినండి.