క‌మ్మ‌కి టీడీపీ, రెడ్డికి వైసీపీ..

ఎప్పుడెప్పుడు వస్తాయా..అని ఏడాదిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరో 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ , వైస్సార్సీపీ పార్టీ లు పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో నిమగ్నంవ్వగా…జనసేన , బీజేపీ , కాంగ్రెస్ పార్టీ లు ఒక్కో జాబితాను విడుదల చేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి.

కాగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం , వైసీపీ లు తమ కులాలకు ఎక్కువ సీట్లు ఇచ్చారని..మిగతా కులాలకు తక్కువ సీట్లు ఇచ్చారనే చర్చ మొదలు అయ్యింది. వైసీపీ ఒకే జాబితాలో మొత్తం అభ్యర్థులను ప్రకటించడం తో తెలుగుదేశం అనుకూల మీడియా..సోషల్ మీడియా లు పెద్ద ఎత్తున వైసీపీ తమ రెడ్డి కులస్తులకే ఎక్కువ సీట్లు ఇచ్చారనే ప్రచారం చేసింది..

తెలుగుదేశం కూడా తక్కువేం కాదు కదా మీరు కూడా మీ కమ్మ కులస్తులకే ఎక్కువ సీట్లు ఇచ్చారు కదా అని వైసీపీ మీడియా ఎదురుదాడి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏ కులస్తులకు ఎన్ని ఎన్ని సీట్లు ఇచ్చారనేది చూస్తే..

* కమ్మ సామాజిక వర్గానికి 41

* రెడ్డి సామాజిక వర్గానికి 27

* కాపు సామాజిక వర్గానికి 24

* ఇతరులకు 05

* బిసి సామాజిక వర్గానికి 41

* ఎస్సి సామాజిక వర్గానికి 27

* ఎస్టి సామాజిక వర్గానికి 06

* మైనార్టీ సామాజిక వర్గానికి 04

మొత్తం మహిళా ఎమ్మెల్యే 16 ఇలా టీడీపీ టికెట్స్ పంచింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారనేది చూస్తే..