ఇంగ్లాండ్ ని ‘గుండు’ కొట్టేసిన భారత్

భారత్ చేతిలో దారుణమైన పరాజయం చవిచూసింది ఇంగ్లాండ్. గత రెండు నెలలుగా భారత్ లో  పర్యటిస్తున్న ఇంగ్లాండ్ ఒక్క సిరిస్ ని కూడా గెలవలేకపోయింది. టెస్ట్, టీ ట్వంటీ, వన్డే .. మూడు సిరిస్ లు కూడా భారత్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఈ రోజు (ఆదివారం) జరిగిన వన్ డే సిరిస్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ సిరిస్ ని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్   329పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాప్ ఆర్డర్ విఫలమైన కీపర్ రిషబ్ పంత్  78పరుగులతో చెలరేగి ఆడాడు, తర్వాత హార్ధిం పాండ్య కూడా 64పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ధావన్ అర్ధ శతకం సాధించాడు,

330పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ని భవి ఆరంభం లోనే దెబ్బ కొట్టాడు. ఓపెనర్లని ఇంటికి పంపాడు. ఐతే ఈ దశలో మిడిలార్డర్ నిలబడింది. మిలన్ అర్ధ శతకం సాధించాడు. ఐతే భారత్ బౌలర్ సార్దుల్ , మిలన్ ని ఇంటికి పంపాడు. ఈ దశలో వచ్చిన సామ్ కరణ్ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ని చివరి వరకూ తీసుకెళ్ళాడు. ఒక దశలో మ్యాచ్ ని గెలిపిస్తాడనే భయాన్ని కూడా కల్పించాడు. ఐతే చివరి రెండు ఓవర్లు భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దీంతో 7పరుగుల తేడా విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మొత్తం సిరిస్ లన్నీ భారత్ వశమైయాయ్యి.