ఏపీలో డీఎస్సీ పరీక్ష కు అన్ని సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ లో రేపు జరగబోయే డీఎస్సీ 2018 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

మొదటిగా జరగనున్న స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, మ్యూజిక్,ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పరీక్షలకు 2లక్షల 62 వేల 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు.

డిసెంబర్ 25 నుంచి ప్రారంభంకానున్న డీఎస్సీ పరీక్షలు జనవరి 4 వరకు జరగనున్నాయి. మొత్తం 7902 పోస్టులకు 6,08,159 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండోదశలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షలు జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.