పదేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకున్న బాలిక.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


ఓ వ్యక్తికి మరణం సంభవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి దాని గురించి తెలుస్తుందని చెబుతున్నారు నిపుణులు.. ఆ వ్యక్తులకు చివరి కోరిక కూడా ఉంటుంది.. వాటిని ఎలా అయిన నెరవేర్చుకోవాలని అనుకుంటారు.. ఎంత కష్టమైన సరే ఆ కోరికను తీర్చుకుంటారు..తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ బాలిక చివరి కోరికను ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 ఏళ్ల బాలిక తన ప్రియుడిని వివాహం చేసుకుంది. కానీ, పాపం అంతలోనే ఆమె మరణించింది. ఈ విషాద సంఘటన అమెరికాలోని నార్త్‌ కరోనలినాలో చోటు చేసుకుంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో చనిపోయే కొన్ని రోజుల ముందు 10 ఏళ్ల అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంది..

ఆ అమ్మాయి చివరి కోరికగా చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకుంది.. అయితే, పాపం ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న పది రోజుల్లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది..నిజానికి ఈ వివాహం కేవలం ఆ బాలికను సంతోషపెట్టడానికి మాత్రమే జరిగింది. అమెరికాలోని నార్త్ కరోలినా నివాసి అయిన ఎమ్మా ఎడ్వర్డ్స్ ఏప్రిల్ 2022 నుంచి తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతోంది.. ఇది రక్తం, ఎముక మజ్జల క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తుంది. చిన్నతనంలోనే క్యాన్సర్ వస్తుంది. ఆమె ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారి బయట పడలేదని కుటుంబ సభ్యులు భావించారు..

పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకున్నారు.. దాంతో ఈ పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రలు కూడా అంగీకరించారు. రెండు రోజుల్లోనే అన్నీసిద్ధం చేశారు.. తండ్రి స్నేహితుడు బైబిల్ చదివి ఆ అమ్మాయి స్నేహితురాలిని గౌరవ పరిచారికను చేశాడు. ఎమ్మా పెళ్లికి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, నర్సులు, అందరూ హాజరయ్యారు. పెళ్లయిన 2 వారాలకే జూలై 11న ఆమె మరణించింది. ఆమె తల్లి అలీనా కన్నీటి పర్యాంతమవుతూ తన కుమార్తె కల నెరవేర్చడానికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. తన కూతురులాగా ఎవరు బాధ పడకూడదని ఆమె కోరుకుంటున్నారు..