” చచ్చిపోతాం అనుకుంటే చంపేయండి “

DGP Dinesh reddy commentsరాష్ట్ర పొలీస్ డైరెక్టర్ జనరల్ దినేష్ రెడ్డి సంచలనాత్మక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఐ.టి.పార్క్ లో జరిగిన ఐ.టి. మహిళా ఉద్యోగుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఎవరైనా మీ మీద అత్యాచారానికి పాల్పడినా, దాడి చేసినా ముందూ వెనుకా చూడకుండా చంపేయండి. ఏమీ పర్వాలేదు, తరువాత మీ మీద కేసు పెడితే ఆ నేపధ్య కారణాల ఆధారంగా మిమ్మల్ని మేము కాపాడతాం. ” అని భరోసా ఇచ్చారు. ” మీ ప్రాణం పోతుందంటే వెనుకాడకండి.” అని ఆయన మహిళలకు పిలుపు ఇచ్చారు. ఆకతాయిల పనిపట్టేందుకు ఈవ్ టీజింగ్ చట్టానికి సవరణలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ  తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి ఫోటోలు, వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్రం చర్యలు గైకొంటోంది అని ఆమె చెప్పారు. ఆకతాయిలపై ఫిర్యాదులు చేయటానికి కేంద్రీకృత టెలిఫోన్ విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డి.జి.పి. తెలిపారు.